బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో ఘోరం జరిగింది. సీతారామపేటకు చెందిన చేనేత కార్మికుడి కుమార్తె (21) బహిర్భూమికి వెళ్లింది. అక్కడ గుర్తు తెలియని దుండగులు ఆమెపై అత్యాచారం చేసి హతమార్చారు. కుమార్తె ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పొదల మధ్య విగతజీవిగా పడి ఉన్న యువతిని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.