నర్సీపట్నం: సమస్యలను సత్వరం పరిష్కరించాలి

52చూసినవారు
నర్సీపట్నంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఆర్డిఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వివి రమణ ప్రజల సమస్యలు తెలుసుకుని వారి వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్