ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఓ ఫంక్షన్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాంను ముఖ్యమంత్రి చంద్రబాబు పలకరించారు. ఇద్దరు నేతలు కొద్దిసేపు సరదాగా నవ్వుకుంటూ ముచ్చటించారు. బలరాం, చంద్రబాబులు పలకరింపులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు బలరాం మళ్లీ టీడీపీలోకి వస్తారా అంటూ చర్చించుకున్నారు.