బుక్కరాయసముద్రం మండలం చెదుళ్లలో ఏడు సెంట్ల ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణలు వెంటనే తొలగించాలని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తహసీల్దారు పుణ్యవతికి గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వెంటనే ఆక్రమణలు తొలగించాలన్నారు. ప్రభుత్వ స్థలాలను సంరక్షించాల్సిన బాధ్యత తహసీల్దారుపై ఉందని గుర్తు చేశారు. తహసీల్దారు ఈ సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.