ఘనంగా శ్రీ భీమలింగేశ్వర స్వామి బిందెసేవ

60చూసినవారు
ఘనంగా శ్రీ భీమలింగేశ్వర స్వామి బిందెసేవ
విడపనకల్ మండలం గడేకల్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వేములవాడ భీమలింగేశ్వర స్వామి మహారథోత్సవంలో భాగంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం బిందెసేవ పూజలో భాగంగా ఆలయ అర్చకులు, గ్రామస్తులు ఊరుబావి నుండి మేళతాళాల మధ్య పవిత్ర జలంతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం బిందేసేవతో పాటు శ్రీ భీమలింగేశ్వర స్వామి, సంజమ్మ అవ్వ మూల విరాట్లను పల్లకిలో గ్రామ పురవీధులలో ఊరేగింపుగా తీసుకువెళ్లడం జరిగింది.
Job Suitcase

Jobs near you