
ఉరవకొండ: ఘనంగా రథసప్తమి వేడుకలు
ఉరవకొండ పట్టణంలో బూదగవి, ఆమిద్యాల గ్రామాల్లో శ్రీసూర్యనారాయణస్వామి దేవాలయాల్లో మంగళవారం రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు స్వామివార్ల మూల విరాట్ కు విశేష పూజలు నిర్వహించారు. సూర్యభగవానుడిని దర్శించుకునేందుకు కర్ణాటక వాసులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రపంచంలో దాక్షిణాభి ముఖంగా ఉన్న ఏకైక సూర్య భగవానుడి ఆలయం కావడం విశేషం. స్వామివారిని దర్శించుకుంటే ఆపమృత్యు దోషం పోతుందని భక్తుల నమ్మకం.