Mar 12, 2025, 15:03 IST/
ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే వెళ్లిపోయా: వధువు (వీడియో)
Mar 12, 2025, 15:03 IST
హైదరాబాద్ నార్సింగిలో ఓ నవవధువు పెళ్లైన 7 రోజులకే మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు యువతి ఓ వీడియో రిలీజ్ చేశారు. తనను బెదిరించి ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే ఇలా చేసినట్లు తెలిపారు. తన ప్రేమ వ్యవహరం, తనకు బలవంతంగా ఈ పెళ్లి చేశారని పెళ్లి కొడుకుకు చెప్పినా వినకుండా తనను టార్చర్ చేశారన్నారు. ఈ క్రమంలోనే తాను ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు.