ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొవాలి: సీఎం రేవంత్‌

57చూసినవారు
ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొవాలి: సీఎం రేవంత్‌
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. "ప్రతిపక్షాలు గందరగోళం చేసే ప్రయత్నం చేస్తాయి. సభ్యులంతా సంయమనంతో వ్యవహరించాలి. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలి. సమన్వయంతో ముందుకెళ్లాలి. అంశాల వారీగా ప్రిపేర్‌ అయి సభకు రావాలి." అని సీఎం సూచించారు.

సంబంధిత పోస్ట్