ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం వాడాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బుధవారం ఏపీ శాసన మండలిలో నారా లోకేష్ మాట్లాడారు. పిల్లలకు కేవలం కడుపు నిండటం కాదు, పౌష్టిక ఆహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తామని లోకేష్ వెల్లడించారు. అలాగే లోకల్ మెనూలను సిద్ధం చేసి.. వారి వారి ప్రాంతీయ రుచులను, వంటకాలను అందించాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు.