ఏపీలో దశలవారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విద్యాశాఖలో సంస్కరణలపై శాసన మండలిలో బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తిరిగి తీసుకువస్తామన్నారు. గత ప్రభుత్వమే బకాయిలు పెట్టిందని, దీనిపై చర్చించేందుకు సిద్ధమని లోకేష్ సవాల్ చేశారు. సభలో చర్చించకుండా వైసీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయి తోకముడిచారని ఎద్దేవా చేశారు.