గార్లదిన్నె మండలం తలగసి పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదివారం పరామర్శించారు. బాధితులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. అధైర్య పడకండి, ప్రభుత్వం అందరికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.