AP: వైఎస్ జగన్పై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చిన్న పిల్లల చిక్కీ డబ్బులు సైతం ఎగ్గొట్టిన సుప్పుని తాను సుద్దపూసని అనడం విచిత్రంగా ఉంది జగన్ గారు! గుడ్లు, చిక్కీలు మొదలుకొని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వరకూ మీరు నా నెత్తిన పెట్టి పోయిన బకాయిలు అక్షరాలా రూ. 6,500 కోట్లు. ఫీజు మొత్తం కడతానని చేతులెత్తేసిన చెత్త పాలన మీది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మార్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఫుట్ బాల్ ఆడుకుంది మీరు’’ అని ఫైర్ అయ్యారు.