జేఆర్ సిల్క్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత
బత్తలపల్లి మండలం వేల్పుమడుగు గ్రామం వద్ద ఉన్న జే. ఆర్ సిల్మ్స్ ఫ్యాక్టరీ ఎదుట గురువారం ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోకి వెళ్లడానికి నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొని బత్తలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల సీపీఐ కార్యదర్శులు వేమయ్య యాదవ్, జగదీశ్ తో పాటు చేనేత నాయకులు పాల్గొన్నారు.