ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గురువారం దారుణ ఘటన జరిగింది. కన్హయ్య తివారీ అనే కుమారుడు తన తండ్రి సత్య ప్రకాష్ తివారీపై ఇటుకతో 20 సార్లు కొట్టి చంపేశాడు. కన్హయ్య తివారీని మద్యం తాగకుండా ఆపేందుకు తండ్రి ప్రయత్నించడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.