మైకేల్ వాన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లతో కలిసి భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు. ‘‘టీ20 క్రికెట్లో అయితే రోహిత్ శర్మను ఎంచుకుంటా. అతడు అత్యుత్తమ కెప్టెన్. రోహిత్ తన బ్యాటింగ్‌తో క్షణాల్లో మ్యాచ్ గమనాన్నే మార్చగలడు. కచ్చితంగా అతడే నా ఫస్ట్ ఛాయిస్’’ అని యువరాజ్ చెప్పాడు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలలో ఎవరిని బెంచ్‌కు పరిమితం చేస్తావని మరో ప్రశ్న అడిగగా తాను బెంచ్‌కు పరిమితవుతానని పేర్కొన్నాడు.