కంబదూరు మండలం ఓబగానపల్లి గ్రామంలో ఈడిగ శ్యామన్న సంబంధించిన ఇల్లు గురువారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేనందున ప్రాణాపాయం తప్పిపోయింది. ఉన్న ఇల్లు అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో గూడు కోల్పోయామని బాధితుడు ఈడిగ శ్యామన్న ఆవేదన వెలిబుచ్చారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణ ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందజేయాలని బాధితులు కోరారు.