కళ్యాణదుర్గం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా కంబదూరు మండలం వెంకటంపల్లి గ్రామానికి చెందిన రాంభూపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి నియమించారు. శుక్రవారం రాంభూపాల్ రెడ్డి నియామకంపై నియోజకవర్గంలోని పలు గ్రామానికి చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.