రెండు ద్విచక్ర వాహనాలు ఢీ-ఒకరు దుర్మరణం

65చూసినవారు
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ-ఒకరు దుర్మరణం
రాయదుర్గం మండలం టి. వీరాపురం సమీపంలో రాయదుర్గం-కణేకల్లు ప్రధాన రోడ్డుపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం సుమారు 4. 50నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు విడపనకల్లు మండలం పాల్తూరుకు చెందిన బొమ్మన్నగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్