రాయదుర్గం: నాటుసారా ఊటలు ధ్వంసం చేసిన పోలీసులు
కణేకల్లు మండలం హనకనహాళ్ గ్రామంలో గురువారం నాటుసారా స్థావరాలపై జిల్లా ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ దాడులు నిర్వహించింది. ఇన్ స్పెక్టర్ అన్నపూర్ణ, సబ్ ఇన్ స్పెక్టర్ హరికృష్ణ, హెచ్ సీ. ఫణీంద్ర, కానిస్టేబుళ్లు మారుతి, సందీప్, రమేష్ రెడ్డి హనకనహాళ్ గ్రామ శివారు ప్రాంతంలో 700 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నిర్వాహకులపై 207, 298 ఎక్సైజ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.