యల్లనూరు మండలంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి పంటను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సోదరి బండారు కిన్నెరశ్రీ శుక్రవారం పరిశీలించారు. పంటపొలాల వద్ద ఉన్న రైతులతో ఆమె చర్చించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రాని నేపథ్యంలో రైతులకు నష్టపరిహారం అందించేలా చూడాలని కిన్నెరశ్రీ అధికారులను కోరారు. అనంతరం నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె భరోసాను కల్పించారు.