అభివృద్ధి పనులపై కౌన్సిల్ తీర్మానం

82చూసినవారు
తాడిపత్రి మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని ఆరు నెలల తరువాత బుధవారం నిర్వహించారు. వైస్ చైర్మన్ అబ్దుల్ రహీం అధ్యక్షతన సమావేశం ప్రశాంతంగా జరిగింది. తాడిపత్రి మున్సిపాలిటీకి సంబంధించి ఆరు అభివృద్ధి అంశాలను కౌన్సిలర్లు సమావేశంలో ఆమోదించారు. ప్రధానంగా పట్టణంలో వీధి దీపాలు, మురుగునీటి సమస్య, పరిష్కారం కోసం పనులకు సంబంధించి వాటిని సమావేశంలో తీర్మానించారు.

ట్యాగ్స్ :