యాడికి: తండ్రి పాడె మోసిన కుమార్తెలు
యాడికిలోని లాలెప్ప కాలనీలో ఉంటున్న చింతా కృష్ణమూర్తి (63) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. మృతుడికి కొడుకులు లేరు. ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అంత్యక్రియలను మహిళలు చేయరాదనే నిబంధన ఉండటంతో ఎలాగని బంధువులు ఆలోచనలో పడ్డారు. మే ఐ హెల్ప్ యూ స్వచ్ఛంద సంస్థ వారు అంత్యక్రియలు చేయడానికి ముందుకు వచ్చారు. ఆఖరి సమయంలో కూతుళ్లు మీనా, రాజేశ్వరి, లత కలిసి తండ్రి పాడెను మోసి రుణం తీర్చుకున్నారు.