తాడిపత్రిలో గత రెండు రోజులుగా దొంగలు హల్ చల్ చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున కడప రోడ్డులోని మూడు దుకాణాల్లో చోరీ జరగడం గమనార్హం. సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు కడప రోడ్డులోని సిమెంట్ దుకాణం, జేసీబీ స్పేర్ పార్ట్స్ దుకాణం, పల్లెటూరి రుచుల హోటల్ లో చోరీ జరిగింది. సిమెంట్ దుకాణంలో రూ. 1800, జేసీబీ స్పేర్ పార్ట్స్ దుకాణంలో రూ. 50వేలను ఎత్తుకెళ్లారని సీఐ వివరించారు.