మీడియా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని శనివారం పీలేరులో ఎన్ఎసుఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆయనపై వచ్చిన ఆరోపణలను నిరూపించుకోవాలని కోరిన జర్నలిస్టులపై అసభ్యకరంగా మాట్లాడటం తగదన్నారు. ఆయన హుందాగా నడుచుకోవాలని వారు హితువు పలికారు.