చక్రాయపేటను కరువు మండలంగా ప్రకటించాలి

78చూసినవారు
చక్రాయపేటను కరువు మండలంగా ప్రకటించాలి
పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక రైతులు, నాయకులు తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. నీటి, పంటల కొరత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా, కాలేటి వాగు ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి, ఆ నీటిని సద్వినియోగం చేసేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.