రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం గొల్లపల్లి ఇసుక రీచ్ లో కాంట్రాక్టర్ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని ట్రాక్టర్ యజమానులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం యంత్రాలతో ఇసుక లోడింగ్ చేయకూడదని నిబంధన ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి హిటాచి యంత్రాన్ని ఉపయోగించి ఇసుక లోడింగ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లగించినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.