దేశంలో సంపద సృష్టిస్తున్న కార్మికులు ప్రభుత్వ విధానాల వల్ల విపత్కర పరిస్థితుల్లో చిక్కుకొన్నారని, నాలుగు లేబర్ కోడ్లు తో కార్మిక వర్గం నడ్డి విరిసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం చేస్తోందని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మాదరాజు గంగాధర్ అన్నారు. ఆదివారం రాజంపేట ఆర్ అండ్ బి బంగ్లా వద్ద ధర్నా కరపత్రాలు విడుదల చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక హక్కులను కాలరాసేందుకు లేబర్ కోడ్లు తెచ్చారన్నారు.