సినిమాలు చూసి ఏడ్చేవారిలో అకాల మరణ ముప్పు
సినిమాలు చూసి ఏడ్చేవారు, తిరస్కరణకు గురవుతామనే భయం ఉన్న వారు, సాధారణ పరిస్థితులను సైతం ముప్పుగా భావించే వారికి అకాల మరణ ముప్పు ఎక్కువ ఉన్నట్టు అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. న్యూరోటిసిజంతో బాధపడుతున్న వారిలో ఇలాంటి ప్రవర్తనలు ఉంటాయని, వీరిలో అకాల మరణ ముప్పు 10 శాతం ఎక్కువ ఉంటుందని తేలింది. న్యూరోటిసిజం కూడా దుఃఖం, భయం, చిరాకు వంటి ప్రతికూల భావోద్వేగాలకు సంబంధించినది.