వైసీపీకి మ‌రో బిగ్ షాక్‌..!

79చూసినవారు
వైసీపీకి మ‌రో బిగ్ షాక్‌..!
ఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి ఏపీ ప్రజలు ఇచ్చిన బిగ్ షాక్ నుంచి కోలుకోకముందే.. నేతలు సైతం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో వైసీపీని మరింత షాక్‌లోకి నెట్టేస్తోంది. తాజాగా ఏలూరులో వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. పార్టీ నేత గంటా ప్రసాద రావు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. వైసీపీ సభ్యత్వానికి, జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి గంటా ప్రసాదరావు రాజీనామా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్