వైసీపీకి మరో షాక్ తగలనుంది. వైసీపీ సీనియర్ నేత కరణం బలరామ్ ఆ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన టీడీపీ లేదా జనసేనలో చేరుతారని సమాచారం. తన కుమారుడు కరణం వెంకటేశ్ కూడా పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ వేడుకలో సీఎం చంద్రబాబుతో బలరామ్ ఆప్యాయంగా పలకరించారు. దాంతో అప్పటి నుంచి ఆయన పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.