ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్ పక్కనే ఉన్న కొండపాకలూరు గార్డెన్స్‌లో అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో గురువారం అర్ధరాత్రి ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వెంకట్రామిరెడ్డి ఈ పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించి అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.