ప్రయాణికులకు APSRTC గుడ్న్యూస్ చెప్పింది. విజయవాడ నుంచి విశాఖ, హైదరాబాద్, బెంగళూరు మధ్య తిరిగే డాల్ఫిన్, అమరావతి బస్సుల్లో రాయితీ అందించనున్నట్లు ప్రకటించింది. చలి తీవ్రత పెరగడంతో ఏసీ బస్సులకు డిమాండ్ తగ్గింది. దీంతో డిసెంబర్ 1 నుంచి 31 వరకు ఆదివారం మినహా మిగతా రోజుల్లో బెంగళూరు వెళ్లే బస్సుల్లో 20%, విజయవాడ నుంచి విశాఖ, హైదరాబాద్ మధ్య నడిచే బస్సుల్లో 10% రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.