ఇక్కడి ప్రభుత్వాలు మౌనమా?: రామకృష్ణ

78చూసినవారు
ఇక్కడి ప్రభుత్వాలు మౌనమా?: రామకృష్ణ
AP: ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ ముడుపుల వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ కేసులో అమెరికా కోర్టు సమన్లు ఇచ్చినా ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. గుజరాత్‌లో ఒక యూనిట్‌ రూ.1.99కి కొనేందుకు ఒప్పందం చేసుకుంటే.. ఏపీలో మాత్రం యూనిట్‌ రూ.2.49కు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోవడం కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బాధ్యులను జైలులో పెట్టాలని డిమాండ్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్