AP: సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్‌తో పాటు విభజన చట్ట ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సి పెండింగ్ సంస్థల గురించి పార్లమెంట్లో చర్చించాలని కోరినట్లు తెలిపారు.