డాండ్రఫ్ సమస్య ఉన్న వాళ్లకు తరచుగా తల చిరాకుగా, దురదగా అనిపిస్తుంది. దీనిని అశ్రద్ధ చేశారంటే హెయిర్‌ఫాల్ ఎక్కువ అవుతుంది. అయితే, తలకు నూనె రాయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజూ కాకపోయిన తలస్నానానికి ముందు నూనె రాస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పోషణకు కొబ్బరి నూనె సహాయపడుతుంది. ఇది జుట్టును మృదువుగా మారుస్తుంది. కొందరు, ఆముదం ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగిస్తారు. వీటిలో విటమిన్ ఇ, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.