తిరుమలలో సామాన్య భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు: బీఆర్‌ నాయుడు

80చూసినవారు
తిరుమలలో సామాన్య భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు: బీఆర్‌ నాయుడు
AP: టీటీడీ ఈవోతో టోకెన్ల జారీ ఏర్పాట్లపై చర్చించినట్లు ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ఇవాళ తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సర్వదర్శన టోకెన్‌ కౌంటర్ల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పారు. సామాన్య భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వీఐపీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you