ముంబయి నుంచి వైజాగ్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలేట్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో 179 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ వరుస ఘటనలతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురవుతున్నారు.