AP: విజయవాడ, వైజాగ్‌లో మెట్రో ప్రాజెక్టులకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ రూపొందించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన డిజైన్లను సీఎం చంద్రబాబు తాజాగా ఆమోదించారు. డబుల్ డెక్కర్ ప్లాన్‌లో పైన మెట్రో ట్రాక్, కింద వాహనాలకు ఫ్లైఓవర్ ఉంటుంది. వైజాగ్‌లో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకు, విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకూ డబుల్ డెక్కర్ ఉంటుంది.