ఒడిశాలోని నయాగఢ్ అడవుల్లో అరుదైన నల్ల చిరుత కనిపించింది. అడవిలో ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల్లో నోట్లో కూనను పట్టుకుని తిరుగుతున్న నల్ల చిరుత కదలికలను గుర్తించామని అటవీశాఖ అధికారులు తెలిపారు. పర్యావరణ వ్యవస్థకు నల్ల చిరుతలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. వాటి ఆవాసాలను రక్షించడమనేది అభివృద్ధి చెందుతున్న వన్యప్రాణుల వారసత్వాన్ని నిర్ధారిస్తుందని వెల్లడించారు.