AP: బోగస్ పింఛన్లపై కూటమి ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. తప్పుడు సదరమ్ ధ్రువపత్రాలతో చాలా మంది పింఛన్లు పొందుతున్నారు. దాంతో హెల్త్, దివ్యాంగుల విభాగాల్లోని పింఛన్లను తనిఖీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి బోగస్ పింఛన్ల ఏరివేత ప్రారంభం కానుంది. మంచానికే పరిమితమై నెలకు రూ.15 వేలు పింఛన్ పొందుతున్న వారు రాష్ట్రంలో 24,091 మంది ఉన్నారు. దివ్యాంగుల విభాగంలో నెలకు రూ.6 వేలు పొందుతున్న వారు 8.18 లక్షల మంది ఉన్నారు.