AP: రాష్ట్రానికి కొత్తగా 10 చేనేత క్లస్టర్లను కేంద్రం మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం నూతన డిజైన్లను ప్రోత్సహించి వారి ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం అమలు చేస్తున్న చిన్నతరహా క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, కాకినాడ, తూ.గో జిల్లాల పరిధిలో ఒక్కొక్కటి, తిరుపతిలో రెండు క్లస్టర్లు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి నివేదించింది. దీనికి కేంద్రం ఆమోదముద్రర వేసింది.