రామపురం బీచ్ వద్ద పర్యాటకుల సందడి!!!

66చూసినవారు
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో మరోపక్క కార్తీక మాసం కలిసి రావడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున బీచ్ కి తరలివచ్చి సముద్ర స్నానాలను ఆచరిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఈ బీచ్ కి తరలి వస్తున్నారు. పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్