పల్నాడు: నవంబర్ 6న ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా

55చూసినవారు
పల్నాడు: నవంబర్ 6న ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా
ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కన్వీనర్ కోట సాయికుమార్ విద్యారంగ సమస్యల పరిష్కారానికి నవంబర్ 6న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం కోటప్పకొండ రోడ్డులోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని, జీవో 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు వసతి దీవెన అందించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు రోహిత్, యాసీన్, బెనర్జీ, సంతోష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్