కేంద్ర హోంమంత్రి అమిత్ షా డా బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన నేపథ్యంలో సోమవారం పెదకాకాని తహసిల్దార్ పి. కృష్ణకాంత్ కు గ్రీవెన్స్ కార్యక్రమంలో పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గాదె నాగేశ్వరరావు, పొన్నూరు మండల అధ్యక్షుడు దిలీప్ వినతిపత్రాన్ని అందించారు. వినతి పత్రాన్ని రాష్ట్రపతికి పంపించి అమిత్ షాపై చర్యలు చేపట్టాలని వారు వినతి పత్రంలో డిమాండ్ చేశారు.