ఢిల్లీలో ఏటా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో ప్రతి రాష్ట్రం నుంచి శకటాలను ప్రదర్శిస్తారు . అయితే 2025 జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏపీ నుంచి ఓ శకటం ఎంపికైంది. ఈసారి ఏటికొప్పాక బొమ్మల శకటంను ఎంపిక చేశారు. తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈసారి శకటం ఉండబోతోందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.