AP: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో విష వాయువులు లీక్ అవడంతో నలుగురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరి పరిస్థితిగా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.