గుర్తు తెలియని వ్యక్తి మృతి
పొన్నూరుకు చెందిన వంట మేస్త్రీ జయ గుంటూరు గాంధీ పార్కు వద్ద పనికోసం నిలిచి ఉన్న 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిని వంట పనుల నిమిత్తం ఈనెల 23వ తేదీన పొన్నూరు తీసుకువచ్చారు. 24వ తేదీన వంట చేస్తూ ఆ వ్యక్తి స్పృహకోల్పోయి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయాడు. చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్య శాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అతని ఆచూకీ తెలిస్తే పొన్నూరు పోలీసులను సంప్రదించాలని కోరారు.