ప్రియుడు మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య?

55చూసినవారు
ప్రియుడు మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య?
ప్రియుడు మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. విజయపురం మండలానికి చెందిన దిల్షాద్ అనే మహిళకు తమిళనాడుకు చెందిన హుస్సేన్‌తో వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే భర్తతో దూరమై దిల్షాద్ అమ్మగారింటికి వచ్చేసింది. ఈ క్రమంలో అశోక్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. అశోక్ భార్యకు డెలివరీ టైం కావడంతో అతను భార్య వద్దే ఉంటున్నాడు. దిల్షాద్‌తో మాట్లాడకుండా ఉండటంతో ఆమె మనస్థాపానికి గురైంది. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్