మాదాపూర్‌లోని ఓ బార్ అండ్ రెస్టారంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సత్వ ఎలిక్విర్ భవనంలోని ఐదో అంతస్తులో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో సిలిండర్లు పేలడంతో భవనం పాక్షికంగా దెబ్బతింది. ఈ ప్రమాదంతో సమీపంలో ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీల ఉద్యోగులను అధికారులు అక్కడి నుంచి పంపించి వేశారు.