టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని వైసీసీ అధినేత, సీఎం జగన్ విమర్శించారు. అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడంటూ సెటైర్లు వేశారు. గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా ఈ సారి టీడీపీకి రావని అన్నారు. మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చామని తెలిపారు. పేదరికాన్ని, అసమానతలను పోగొట్టిన బాధ్యతల ప్రభుత్వం మనది అని గర్వంగా చెబుతున్నానని పేర్కొన్నారు.